Is Mail ID Hacked or Not.. మీ మెయిల్ ఐడి హాక్ అయిందా.. లేదా..


మీ మెయిల్  ఐడి  హాక్ అయిందా.. లేదా.. ఎలా తెలుసుకోవాలో  చూద్దాం :
టెక్నాలజీ కారణంగా మనిషికి ప్రైవసీ అనేదే లేకుండా పోతోంది. ప్రపంచం  అంతా టెక్నాలజీ ఆధారంగానే నడుస్తోంది.  ప్రతి పనికి టెక్నాలజీనే వాడుతున్నారు. టెక్నాలజీ  వలన కలిగే మంచితో పాటు చెడు కూడా జరుగుతుంది. . టెక్నాలజీ కారణంగా ప్రజల విలువైన సమాచారం పాటు  వ్యక్తిగత వివరాలు తస్కరించబడుతుంది. వారితో ముడిపడి ఉన్న ప్రతీ అంశం బహిర్గతం అయిపోతోంది. దీనంతటికీ కారణం టెక్నాలజీయే. దానికి చిన్న ఉదాహరణగా ఫేస్‌బుక్‌ను చెప్పుకోవచ్చు. వినియోగదారులు.. ఫేస్‌బుక్ ఖాతా తెరవాలంటే ఈమెయిల్ ఐడీ కానీ.. ఫోన్ నెంబర్ కానీ అవసరం అవుతాయి. అలా యూజర్.. ఫేస్‌బుక్‌ లాగిన్ కోసం ఇచ్చిన మెయిల్ ఐడీ, ఫోన్‌ నెంబర్లు ఇటీవలి కాలంలో లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 53 కోట్లకు పైగా వినియోగదారుల డేటా లీకైందని ప్రచారం జరిగింది. ఈ లీకైన జాబితాలో 60 లక్షల మంది ఇండియన్స్ అకౌంట్ల వివరాలు కూడా ఉన్నాయని పేర్కొంది.



ఈ నేపథ్యంలో.. సదరు యూజర్లు తమ ఈమెయిల్ ఐడీ లీక్ అయ్యిందా? లేదా? అని అని తెలుసుకునేందుకు.. అంతర్జాలంలో సులువైన పద్ధతి అందుబాటులోకి వచ్చింది. ఈ విధానం ద్వారా వెంటనే ఈ మెయిల్ ఐడీ లీకైందా? లేదా? అనేది తేలిపోతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సాంకేతిక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. https://haveibeenpwned.com ని ఓపెన్ చేయాలి. మీరు మీ ఫెస్‌బుక్‌ లాగిన్ కోసం ఇచ్చిన ఈమెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. అనంతరం <br>పై క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే.. మీ ఈమెయిల్ ఐడీ లీకైందా? లేదా? అనేది తేలిపోతుంది. అతేకాదు.. మీ ఈమెయిల్ ఐడీ పూర్తిగా లీకైందా ? కొంతమాత్రమే లీకైందా ? అనేది కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. మరెందుకు ఆలస్యం ఇప్పుడే చెక్ చేసి చూడండి.




Post a Comment

0 Comments